బిల్డర్‌కు గ్యాంగ్‌స్టర్ ఛోటా షకీల్ వార్నింగ్!
ముంబైలో ప్రముఖ బిల్డర్ మెహుల్ మెహతాకు అండర్‌వరల్డ్ డాన్ ఛోటా షకీల్ పేరుతో వార్నింగ్ వచ్చింది. అంధేరి వెస్ట్‌లోని ఓ నిర్మాణ స్థలం వద్ద ఉన్న ఆయన కారుపై గుర్తు తెలియని వ్యక్తులు ఒక ప్లాస్టిక్ ప్యాకెట్‌ను ఉంచారు. అందులో బెదిరింపు లేఖతో పాటు లైవ్ బుల్లెట్ ఉండటం కలకలం రేపింది. 'నీ తీరు మార్చుకో.. లేదంటే ఈ బుల్లెట్ నీ గుండెల్లోకి దిగుతుంది' అని ఆ లేఖలో హెచ్చరించారు.