మున్సిపల్ అధికారులతో సమావేశమైన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్

మహబూబ్ నగర్: నగర పురపాలక మున్సిపల్ అధికారులతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ మంగళవారం సమావేశం నిర్వహించారు. పట్టణ పురపాలక పరిధిలో మెప్మా కార్యక్రమాలు, పారిశుధ్య కార్యక్రమాలు, రీజనల్ వ్యాధులు, మున్సిపల్ దుకాణాల కిరాయిలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.