ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
WNP: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఆదివారం 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు 'మన నేస్తాలు పుస్తకాలు' కార్యక్రమంలో భాగంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితి కళావేదిక అధ్యక్షులు పలుసు శంకర్ గౌడ్ 200 పుస్తకాలను, రామశర్మ 200 పుస్తకాలను గ్రంథాలయానికి అందజేశారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని శంకర్ గౌడ్ ఈ సందర్భంగా సూచించారు.