ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష తగదు

ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష తగదు

అన్నమయ్య: డిసెంబర్ 1న వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా డైట్ కళాశాలలో అవగాహన కార్యక్రమాలు జరిగాయి. అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ రాధిక, లాయర్ భారతి, క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ భాస్కర్ పాల్గొన్నారు. సుమారు 30 మంది విద్యార్థినులతో రంగోలి పోటీలు నిర్వహించి, ఎయిడ్స్ వ్యాప్తి కారణాలు, నివారణపై సందేశాలు తెలియజేశారు. ఎయిడ్స్ రహిత సమాజం కోసం అవగాహన పెంచాలని కోరారు.