'వైసీపీ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు'

తూ.గో: వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం కుతుకులూరులో ఆదివారం జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటిస్తూ టీడీపీ, జనసేన మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు.