INSPIRATION: జవహర్ లాల్ నెహ్రూ

INSPIRATION: జవహర్ లాల్ నెహ్రూ

భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్య్ర సమరయోధుడు, ఆధునిక భారతదేశ రూపశిల్పిగా నిలిచారు. సామ్యవాదం, లౌకికవాదం, ప్రజాస్వామ్య విలువలను దేశానికి వారసత్వంగా ఇచ్చారు. సైన్స్, టెక్నాలజీ అభివృద్ధికి కృషి చేసి పరిశోధనా సంస్థల స్థాపనకు మార్గదర్శకత్వం వహించారు. పిల్లలపై అపారమైన ప్రేమతో వారిని దేశ భవిష్యత్తుగా నమ్మేవారు, అందుకే ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటారు.