మహిళల రక్షణకు 'శక్తి యాప్': ఎస్సై

మహిళల రక్షణకు 'శక్తి యాప్': ఎస్సై

ELR: ముసునూరులో మహిళా కార్మికులకు ఇవాళ సాయంత్రం 'శక్తి యాప్' ఉపయోగాలను ఎస్సై చిరంజీవి వివరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఆపదలో మహిళల రక్షణ కవచంగా శక్తి యాప్ నిలుస్తుంది అన్నారు. స్మార్ట్ ఫోన్ లేని వారికి ఎస్ఎంఎస్ ద్వారా అపాయాన్ని సూచిస్తూ సమాచారం అందించవచ్చు అన్నారు. అత్యవసర సమయంలో 112 కు సమాచారం అందిస్తే పోలీసులు స్పందించి రక్షిస్తారన్నారు.