నేడు పురపాలక కౌన్సిల్ సమావేశం
PLD: మాచర్ల పురపాలక సంఘం కౌన్సిల్ సాధారణ సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు జరగనున్నట్లు మున్సిపల్ కమిషనర్ వేణు బాబు ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి హాజరుకానున్నారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారుల అంశాలపై చర్చించనున్నారని తెలిపారు.