VIDEO: కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. పలువురికి గాయాలు
SRPT: నడిగూడెం మండలం రామచంద్రపురం శివారులో కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా కొట్టడంతో పలువురికి స్వల్ప గాయాలైన ఘటన ఇవాళ చోటుచేసుకుంది. వ్యవసాయ కూలీలతో ఆటో వెళ్తుండగా టైరు పేలి అదుపుతప్పిన ఆటో బోల్తా కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను చికిత్సమిత్తం నడిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.