VIDEO: పత్తి రైతులకు మద్దతు ధర ప్రకటించాలి: సీపీఐ
GNTR: పత్తి రైతులకు న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని సీపీఐ నాయకులు హెచ్చరించారు. గుంటూరు సీసీఐ కార్యాలయం వద్ద బుధవారం నిర్వహించిన ధర్నాలో ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు కే.వి.వి. ప్రసాద్ మాట్లాడారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి పత్తికి క్వింటాకు రూ.12 వేల మద్దతు ధర ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.