కార్యకర్తల గ్రీవెన్స్‌లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం కార్యకర్తల గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గళ్ళా మాధవి నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించిన ఆమె, సమస్యలను సంబంధిత శాఖలకు అనుసంధానం చేసి తక్షణ పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.