మంత్రి ఆదేశాలతో గాలింపు చర్యలు

మంత్రి ఆదేశాలతో గాలింపు చర్యలు

ELR: నూజివీడు మండలం తుక్కులూరు శివారు రామిలేరు వాగులో ఆదివారం చర్చికి వెళ్లి వస్తూ ప్రమాదవశాత్తు పడిపోయిన ఫార్మసీ విద్యార్థిని నీరజ గల్లంతైన విషయం తెలిసిందే. ఆమె ఆచూకి తెలియకపోవడంతో మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాలతో పోలీసులు, SDRF సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మంత్రి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్విని సంప్రదించి త్వరిత చర్యలకు ఆదేశించారు.