బాలికను ఢీకొన్న బైక్
MLG: కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి బంకు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న 12 ఏళ్ల బాలికను వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. దీంతో బాలిక స్పృహ కోల్పోయి కిందపడింది. ఈ ప్రమాదంలో బాలిక ముఖం, తలకు గాయాలు అయ్యాయి. 108 సిబ్బంది చేరుకుని ప్రథమ చికిత్స అందించి మెరుగైన బాలికను ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు.