నేడు ఖాతాల్లోకి డబ్బులు
TG: రైతాంగం ఆశగా ఎదురుచూస్తున్న 'రైతు భరోసా' నిధులను CM రేవంత్ రెడ్డి ఈరోజు విడుదల చేయనున్నారు. సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం అనంతరం నిధుల పంపిణీని CM ప్రారంభిస్తారు. ఎకరానికి రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయం నేటి నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో చేరనుంది. తొలి విడతలో ఎకరంలోపు రైతులకు, ఆ తర్వాతి దశల్లో మిగతా వారికి ఈ సాయాన్ని ప్రభుత్వం అందజేయనుంది.