'ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి'
ADB: ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని MLA అనిల్ జాదవ్ కోరారు. బోథ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన 119 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. నిరుపేద కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.