జిల్లా సాధనలో ఎమ్మెల్యే కీలక పాత్ర
అన్నమయ్య: మదనపల్లి జిల్లా, పీలేరు రెవెన్యూ డివిజన్ సాధనలో MLA కిషోర్ కుమార్ రెడ్డి కృషి ఎనలేనిదని కూటమి శ్రేణులు బుధవారం ప్రశంసించారు. కలికిరి మండలం నగిరిపల్లెలో పుంగనూరు, మదనపల్లి, పీలేరు ప్రజలు, అభిమానులు ఆయనను గజమాలతో సత్కరించారు. జిల్లా కోసం ఉద్యమాలు చేసి, సభలు నిర్వహించి ప్రజాభిప్రాయాన్ని రాష్ట్రానికి చేరవేసిన నల్లారి పోరాటమే దీనికి ఫలితమని పేర్కొన్నారు.