నేడు ఉస్మానియాకు సీఎం రేవంత్
HYD: సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు సభా ప్రాంగాణాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం పలు నూతన భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. కాగా, ఇదే ఏడాది ఆగస్టులో సీఎం ఠాగూర్ ఆడిటోరియంలో మాట్లాడుతూ.. మళ్లీ డిసెంబర్‌లో ఉస్మానియాకు వస్తా.. రూ. 1000 కోట్లు కేటాయిస్తా అని చెప్పిన విషయం తెలిసిందే.