జ్ఞాపకంగా మిగిలిన ఆలమూరు వెండితెర..!

జ్ఞాపకంగా మిగిలిన ఆలమూరు వెండితెర..!

కోనసీమ: దశాబ్దాల క్రితం వినోదానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ఆలమూరు సినిమా థియేటర్ నేడు కేవలం ఒక జ్ఞాపకంగానే మిగిలింది. ఆ రోజుల్లో గుమ్ములేరు, చింతలూరు, జొన్నాడ వంటి పక్క గ్రామాల నుంచి సినీ అభిమానులు సైకిళ్లపై తరలివచ్చి సందడి చేసేవారు. కాలక్రమేణా వచ్చిన మార్పులు, ప్రేక్షకుల ఆదరణ తగ్గడంతో ఈ థియేటర్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొని నెమ్మదిగా మూతపడింది.