సవినియోగదారులతో మర్యాదగా మెలగాలిస
VZM: గ్యాస్ డెలివరీ బాయ్స్ వినియోగదారులతో మర్యాదగా మెలగాలని జేసీ ఎస్ సేధు మాధవన్ ఆదేశించారు. ప్రవర్తన సరిగా లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం తన ఛాంబర్‌లో జిల్లా పౌరసరఫరాల అధికారి జి.మురళీనాథ్, గ్యాస్ డీలర్లు, రేషన్ డీలర్లతో ఆయన సమావేశమయ్యారు. గ్యాస్ పంపిణీలో పారదర్శకత ఉండాలని, అదనపు వసూళ్లకు తావుండకూడదని స్పష్టం చేశారు.