BREAKING: భారీ వర్షం.. బయటకు రావద్దు
TG: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, పంజాగుట్ట, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం పడుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని GHMC అధికారులు సూచించారు.