పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
VZM: ఆలమండ రైల్వేస్టేషన్ పరిధిలో ట్రాక్‌మెన్‌గా పని చేస్తున్న నాగరాజు గడ్డి మందు తాగి మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. నాగరాజు కొన్నాళ్లుగా వీపుపై కాయలు, దగ్గుతో బాధపడుతున్నాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో, దగ్గు మందు అనుకుని గడ్డి మందు తాగడంతో అస్వస్థతకు గురై, విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు.