'గురజాడ నివాస నిర్వహణను మెరుగుపర్చండి'

'గురజాడ నివాస నిర్వహణను మెరుగుపర్చండి'

విజయనగరం పట్టణంలలోని మహాకవి గురజాడ నివాస నిర్వహణను విస్మరించడంపై పౌర వేదిక అధ్యక్షులు బీశెట్టి బాబ్జి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన గురజాడ నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇది నేతల నిర్లక్ష్యమయని, అధికారుల అలసత్వమని అన్నారు. గురజాడ నివాసం చుట్టూ అపరిశుభ్రత ఆయనకు ఇచ్చే గౌరవమా అని ప్రశ్నించారు. ఇకనైనా నిర్వహణను మెరుగుపరచాలని కోరారు.