భారత నేవీ ‘త్రిశూల శక్తి’ ప్రదర్శన

పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం శక్తి సామర్థ్యాలను చాటిచెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా వైమానిక, నేవీ విన్యాసాలు నిర్వహిస్తోంది. విధ్వంసక నౌక INS కోల్‌కతా, ధ్రువ్ హెలికాప్టర్, స్కార్పీన్ క్లాస్ జలాంతర్గామి ఓ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న ఫొటోను నేవీ SMలో పోస్టు చేసింది. 'భారత నేవీ త్రిశూల శక్తి.. సముద్రం పైన.. కింద.. అలల మీదుగా' అనే క్యాప్షన్ పెట్టింది.