ఉపాధి క్యాంపెయిన్ గోడపత్రికలు విడుదల
PPM: ఈ నెల 21వ తేదీ వరకు జరిగే ఇంటింటి ఉపాధి క్యాంపెయిన్‌ను జయప్రదం చేయాలని కొమరాడలో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సాంబమూర్తి ఆదివారం పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, పని హక్కును కాపాడాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఉపాధి హామీ కూలీలతో కలిసి ఇంటింటికి ఉపాధి క్యాంపెయిన్ గోడపత్రికలను విడుదల చేశారు.