జూరాలకు భారీ పెరిగిన వరద

జూరాలకు భారీ పెరిగిన వరద

GDWL: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద పోటెత్తడంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు మంగళవారం ప్రాజెక్టులోని 31 గేట్లను ఎత్తి, వరద నీటిని దిగువకు విడుదల చేశారు. కృష్ణమ్మ ఉగ్రరూపంతో ప్రవహిస్తుండటంతో నదీ తీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేశారు.