జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

WNP: జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా పానగల్ మండల కేంద్రంలో 61.8 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. పెద్దమందడి, వనపర్తి 46.5 మి.మీ, కొత్తకోట 45.0 మి.మీ, కేతేపల్లి 41.0 మి.మీ, జానంపేట 32.0 మి.మీ, మదనపూర్ 28.5 మి.మీ, శ్రీరంగాపూర్ 26.8, వీపనగండ్ల 24.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.