44 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
ATP: పెద్దవడుగూరు మండలంలోని మిడుతూరు గ్రామ సమీపంలో గల 44 హైవేపై శనివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సును లారీని తీసుకెళ్తున్న క్రేన్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. ట్రావెల్ బస్సు మాత్రం పాక్షికంగా దెబ్బతింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.