సెంట్రల్ లైటింగ్‌కు రూ. రెండు కోట్ల నిధులు

సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని రాజంపేట నుంచి హాస్టల్ గడ్డ వరకు రోడ్డు, సెంట్రల్ లైటింగ్‌కు రూ. రెండు కోట్లతో పనులు సెప్టెంబర్ 10లోపు ప్రారంభించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మున్సిపల్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జనరల్ ఫండ్ నుంచి పనులు ప్రారంభించాలని సూచించారు.