మెగా డీఎస్సీ సమర్థవంతంగా పూర్తి చేశాం: ఎమ్మెల్యే నసీర్
GNTR: మెగా DSC-2025 నిర్వహణకు వైసీపీ అడుగడుగునా ఇబ్బందులు సృష్టించినా కూటమి సమర్థవంతంగా పూర్తి చేసిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అన్నారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను బుధవారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన సత్కరించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డీఎస్సీని చేపట్టకుండా దగా చేసిందని దుయ్యబట్టారు.