పేరుసోమల గ్రామంలో పర్యటించిన మంత్రి బీసీ

NDL: సంజామల మండలం పేరుసోమల గ్రామంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం పర్యటించారు. గ్రామంలో ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమంలో మంత్రి బీసీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం చెన్నకేశవ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.