ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ
CTR: పెనుమూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కలవగుంట ఎస్సీ కాలనీలో 30 మందికి పోలీసు సిబ్బంది శనివారం హెల్మెట్లు పంపిణీ చేశారు. వారు హెల్మెట్లు లేకుండానే వాహనాలు నడుపుతున్నట్టు గుర్తించి.. ఓ గ్యాస్ ఏజెన్సీ సహకారంతో వాటిని పంపిణీ చేశారు. బైక్‌లు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని సూచించారు. ప్రమాదాలలో అవి ప్రాణాలను కాపాడుతాయని అవగాహన కల్పించారు.