జిల్లాలో పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశం
W.G: పెదఆమిరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ నాగరాణి అధ్యక్షతన 24వ జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అనుమతులు ఇచ్చి వదిలేయకుండా, వారు యూనిట్ ఏర్పాటు చేసి ఉత్పత్తి ప్రారంభించే వరకు పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు.