'వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి'

'వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి'

NLG: నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ, హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు ఆసుపత్రి వారు సంయుక్తంగా నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఇలాంటి శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.