ఫిలింనగర్ ప్రధాన దారిలో వరదలా మురుగు

ఫిలింనగర్ ప్రధాన దారిలో వరదలా మురుగు

HYD: ఫిలింనగర్ ప్రధాన రోడ్డుపై గత కొన్నినెలల నుంచి మురుగు సమస్య స్థానికులను వేధిస్తోంది. ఫిలిం ఛాంబర్ పక్కనుంచి మురుగు పొంగుతూ ప్రధాన రోడ్డు వెంట దుకాణాలను దాటుతూ ఫిలింనగర్ కాలనీలోకి ప్రవహిస్తోంది. దీంతో ప్రతిరోజు తీవ్ర అసౌకర్యంగా ఉందని, జలమండలి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.