జూదం ఆడుతున్న ఆరుగురి అరెస్ట్

జూదం ఆడుతున్న ఆరుగురి అరెస్ట్

కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు వుయ్యూరు రూరల్ ఎస్సై ఆధ్వర్యంలో ముదునూరు గ్రామ పరిసరాల్లోని పొలాల్లో జూదం ఆడుతున్న వారిపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో రూ. 4,000 నగదు స్వాధీనం చేసుకుని, జూదంలో పాల్గొన్న 6 మందిని అదుపులోకి తీసుకున్నారు.