అనంతపురం సభ.. ఈ విషయాలు తెలుసా?

AP: అనంతపురంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ - సూపర్ హిట్ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభా ప్రాంగణం చుట్టూ 400 ఎకరాల్లో 44 ప్రాంతాల్లో పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసింది. భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్, 400 మంది పోలీసులు, 40 డ్రోన్లతో ప్రత్యేక బందోబస్తు, 100 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో ప్రధాన వేదికను నిర్మించింది.