యూరియా కోసం ఆందోళన వద్దు: ఎమ్మెల్యే
E.G: యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు. కోరుకొండ మండలం గాదరాడలో సోమవారం నియోజకవర్గ ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లు, వ్యవసాయ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితిల్లో రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా ప్రభుత్వం చూస్తుందని, రైతులు ఆందోళన చెందకూడదని ఆయన పేర్కొన్నారు.