VIDEO: 'వాహనాలను బహిరంగ వేలం వేయండి'

VIDEO: 'వాహనాలను బహిరంగ వేలం వేయండి'

ELR: నూజివీడు పట్టణంలోని పంచాయతీరాజ్ మరియు ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాల వద్ద ఎంతో విలువైన వాహనాలు వృధాగా శిథిలమైపోయాయి. కాలక్రమేణా వాహనాలు తుప్పు పట్టి ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. ఇదే తీరు కొనసాగితే భూమిలో కలిసిపోతాయని ప్రజలు వాపోతున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వినియోగంలో లేని వాహనాలను బహిరంగ వేలం వేయాలని ప్రజలు కోరారు.