ప్రభుత్వ దవాఖానలో నిలిచిపోయిన స్కానింగ్ సెంటర్

SRPT: పేదలకు మెరుగైన వైద్యం అందించాల్సిన సూర్యాపేట ప్రభుత్వ దవాఖానలో నిర్వహణ లోపం కొట్ట్టొచ్చినట్లు కనిపిస్తుంది. నిత్యం రోగులతో కిటకిటలాడే ప్రభుత్వ దవాఖానలో ఐదు రోజుల నుంచి స్కానింగ్ సెంటర్ సేవలు నిలిచిపోయాయి. స్కానింగ్ సెంటర్ నిర్వహించాల్సిన రేడియాలజిస్ట్‌లు అందుబాటులో లేకపోవడంతో రోగులు నానాయాతనలు పడుతున్నారు.