గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

ఆదిలాబాద్: కుంటాల మండలంలోని కల్లూరు గ్రామ శివారులోని పెట్రోల్ బంకు వెనకాల గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న ఎస్సై రజనీకాంత్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడికి 50- 55 ఏళ్లు ఉంటుందని నల్లని ప్యాంటు, పసుపు రంగు షర్టు ధరించాడన్నారు. ఆచూకీ తెలిసిన వారు 8712659535, 8712659534 నంబర్లలో సంప్రదించాలని ఎస్సై తెలిపారు.