ఇక ఫోన్‌లోనూ పోస్టల్ సేవలు
పోస్టల్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేలా తపాలా శాఖ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. పోస్టల్ డిపార్ట్‌మెంట్ అందించే సేవలన్నీ ఫోన్‌లోనూ వినియోగించుకునేలా 'డాక్ సేవ' అనే పేరుతో యాప్‌ను విడుదల చేసింది. దీంతో ఎక్కడి నుంచైనా సేవలు పొందొచ్చు. తపాలా శాఖ అందించే ప్రయోజనాలన్నీ ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయని పోస్టల్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.