ALERT: మూడు రోజుల పాటు వర్షాలు

ALERT: మూడు రోజుల పాటు వర్షాలు

TG: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, HYD సహా పలు జిల్లాల్లో ఈదురు గాలులతో వానలు పడొచ్చని పేర్కొంది. దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఈ మార్పులు సంభవిస్తున్నాయి. మరోవైపు నిన్న ఆదిలాబాద్‌లో గరిష్టంగా 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.