మీ సేవ కేంద్రాల అక్రమాలపై ACB కొరడా..!
NZB: రాష్ట్రవ్యాప్తంగా పలు మీ సేవ కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) కొరడా ఝుళిపించింది. నేడు NZBతో పాటు రాష్ట్రంలోని 13 మీ సేవా కేంద్రాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లేదా మీ సేవ నిర్వాహకులు లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు.