జీహెచ్ఎంసీ కమిషనర్‌ను కలిసిన పరమేశ్వర్ రెడ్డి

మేడ్చల్: జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తిని శుక్రవారం ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి రూ.101 కోట్లతో చేపట్టనున్న ఎస్ఎన్డీపీ పనుల ప్రారంభోత్సవంపై చర్చించారు. నియోజకవర్గంలో నాలాల అభివృద్ధికి కృషి చేయాలని కమిషనర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడ కార్పొరేటర్ దర్పెల్లి రాజశేఖరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.