భారీగా రేషన్ బియ్యం పట్టివేత

భారీగా రేషన్ బియ్యం పట్టివేత

NRPT: నర్వ మండలం యంకి గ్రామంలో శనివారం అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎరుకలి శ్రీనివాసులు అనే వ్యక్తి తన ఇంట్లో దాచిన 19 బస్తాల (విలువ రూ.14,500) రేషన్ బియ్యాన్ని ఎస్సై పబ్బతి రమేష్ బృందం పట్టుకుంది. డీటీ నాగరాజు ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని, బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.