ఉమ్మడి జిల్లా 10,395 కేసులు పరిష్కారం
VZM: ఉమ్మడి జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ విజయవంతమైంది. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 10,395 కేసులు పరిష్కారమైనట్లు అధికారులు తెలిపారు. సివిల్ కేసులు 348, క్రిమినల్ కేసులు 10,047, ప్రీ-లిటిగేషన్ కేసులు 21 పరిష్కారమయ్యాయి. మోటార్ ప్రమాద బీమా కేసులో పిటిషనర్‌కు రూ.68 లక్షల పరిహారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా అందజేశారు.