మహిళ వీడియో తీసిన యువకుడు అరెస్ట్
BHPL: మొగుళ్లపల్లి మండలంలోని ఓ గ్రామంలో ఇవాళ స్నానం చేస్తున్న మహిళ ఇంట్లోకి చొరబడి, ఆమె వీడియో రికార్డు చేసి, అసభ్యంగా ప్రవర్తించిన శ్రీపతి దిలీప్ అనే యువకుడిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.