కాంగ్రెస్ నాయకుల అవినీతికి అడ్డు లేదు: మాజీ ఎమ్మెల్యే

కాంగ్రెస్ నాయకుల అవినీతికి అడ్డు లేదు: మాజీ ఎమ్మెల్యే

NLG: నాగార్జునసాగర్‌లో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యథా రాజా తథా ప్రజా అంటూ మంత్రులు పోటీపడి దోచుకుంటున్నారని అన్నారు. నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.