గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

SKLM: గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని పాతపట్నం ఎస్సై బి లావణ్య మంగళవారం ఆంధ్ర ఒడిశా చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నారు. నిందితుడు గార మండలం పొగాకువానిపేట చెందిన సాయి సురేశ్ రెడ్డిగా తెలిపారు. నిందితుడు వద్ద నుండి 5.66 కిలోల గంజాయిని, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని పాతపట్నం సీఐ వి.రామారావు తన కార్యాలయంలో మీడియా సమావేశంలో తెలిపారు.