శిరిగిరిపాడులో భారీగా మారణాయుధాలు

PLD: వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులో పోలీసులు ఆదివారం మారణాయుధాలను గుర్తించారు. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు ఆ గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ధ్రువీకరణ లేని 21 బైకులు, కత్తులు, గొడ్డళ్లు, గడ్డ పలుకులు, ఇనప రాడ్లు, కర్రలు, కారం నీటితో కలిపిన బాటిళ్లు, బడిశలు, గోతాలలో నింపిన రాళ్లు పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.